ఉపాధి హామీ పనులు ప్రారంభం

ఉపాధి హామీ పనులు ప్రారంభం

MDK: నిజాంపేట మండల పరిధిలోని జెడ్ చెరువు తండాలో బుధవారం ఉపాధి హామీ పనులను సర్పంచ్ బాబు నాయక్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న 100 రోజుల పని కాలాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామస్తుల ఆర్థికాభివృద్ధికి ఉపాధి పనులు ఎంతో దోహదపడతాయని తెలిపారు.