'సురక్షితమైన రేపటి కోసం వ్యర్థాల రీసైకిల్'

KRNL: సి.బెళగల్ మండలంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట మూడవ శనివారం స్వచ్ఛతపై, ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ఎంపీడీవో రాణేమ్మ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. వెలుగు ఏపీఎం రమేశ్ ర్యాలీలో పాల్గొన్న వారిచే సురక్షితమైన రేపటి కోసం ఈ వ్యర్థాలను రీసైకిల్ చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఏవో, పంచాయతి కార్యదర్శులు, సర్పంచ్ పాల్గొన్నారు.