మార్కెట్‌లో భారీగా తగ్గిన పత్తి ధర

WGL: రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ప్రారంభమైంది. గత వారంతో పోలిస్తే పత్తి ధర భారీగా తగ్గింది. నేడు క్వింటా పత్తి రూ.7,410 ధర పలికింది. 15 రోజుల క్రితం పత్తి ధర రూ.7,700 పలకగా.. గతవారం రూ.7,510కి చేరింది. ఈ వారం మరింత తగ్గింది. పత్తి ధర పడిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.