ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

SKLM: హిరమండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే గోవిందరావు శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో గల ప్రజలు వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు. స్వయంగా అర్జీదారులతో మాట్లాడిన ఆయన అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.