'పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి'
KMM: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు, రైతు సమస్యలపై మోసపూరిత విధానాలు అవలంబిస్తోందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ మండిపడ్డారు. వైరాలో ఆయన మాట్లాడుతూ.. సీఎం పర్యటనలకు ఖర్చు చేసినంత డబ్బు జిల్లా అభివృద్ధికి కేటాయించలేదని, బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌కు పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.