నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కాకినాడ రూరల్ రమణయ్యపేట సెక్షన్ పరిధిలో 11 కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ ఉదయభాస్కర్ తెలిపారు. దీంతో విద్యుత్ నగర్, ఫ్రెండ్స్ కాలనీ, నూకాలమ్మగుడి ఏరియా, సీటీవో కాలనీ, వైద్యనగర్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.