'పశువులకు తప్పకుండా టీకాలు వేయించాలి'
PDPL: రైతులు తమ పశువులకు వ్యాధులు రాకుండా తప్పకుండా టీకాలు వేయించాలని సర్పంచ్ గోపు సంతోష్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చిల్లపల్లిలో ఏర్పాటు చేసిన గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ వ్యాధి వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుందని తెలిపారు. పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.