లేబర్ కోడ్ చట్టాలతో తీవ్ర అన్యాయం

VZM: లేబర్ కోడ్ చట్టాలతో కార్మికులకు తీవ్ర నష్టమని CITU జిల్లా అధ్యక్షులు శంకరరావు అన్నారు. స్థానిక CITU కార్యాలయంలో సోమవారం మే డే ప్రచార పత్రాలను విడుదల చేశారు. మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులపై దాడి చేస్తుందని విమర్శించారు. కార్మికుల పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మార్చివేసి 4 లేబర్ కోడ్ చట్టాలను అమలు చేయడం దుర్మార్గమన్నారు.