మహాశివరాత్రి ఏర్పాటను పరిశీలించిన జిల్లా ఇన్‌స్పెక్టర్
NZB: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర స్వామి మందిరంలో జరుగు మహాశివరాత్రి జాతర ఉత్సవాల ఏర్పాట్లను శుక్రవారం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ కమల పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని కార్యనిర్వహణ అధికారికి పలు సూచనలు చేశారు. ఆలయంలో క్యూలైన్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈవో రాములు పాల్గొన్నారు.