ప్రజారోగ్య భద్రతకు ఐయంఏ మాస్కుల పంపిణీ
MULG: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ప్రజారోగ్య భద్రత, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఐయంఏ వరంగల్ శాఖ, ఐయంఏ రాష్ట్ర శాఖతో కలిసి 25 వేల మాస్కులు పంపిణీ చేసినట్లు బుధవారం జిల్లా అధ్యక్షులు డా. పి. మన్మోహన్ రాజు తెలిపారు. ఈ మాస్కులు లక్షలాది భక్తులు హాజరయ్యే జాతరలో ఆరోగ్య భద్రతకు ఇవి ఉపయోగపడతాయని వారు తెలిపారు.