గూడ్స్ రైలు ఢీకొట్టి వలస కూలి మృతి

గూడ్స్ రైలు ఢీకొట్టి వలస కూలి మృతి

BDK: చండ్రుగొండ మండలం, రవికంపాడు వద్ద విషాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలి సోయం రాములుని గూడ్స్ రైలు మంగళవారం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.