తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు

పల్నాడు: వినుకొండ పట్టణంలోని పలు షాపులలో తూనికలు-కొలతలు శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఆటో మొబైల్స్, కూల్ డ్రింక్స్, ఆయిల్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. కూల్ డ్రింక్ షాపులలో వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించి పలు షాపులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తూకాలలో తేడా ఉన్నా, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.