స్వామివారి దర్శనం ఇక వేగవంతం
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఉచిత క్యూలైన్ల నిర్వహణలో మార్పులు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ చక్రధర్ రావు ఆదివారం తెలిపారు. క్యూలైన్ల పనులను పరిశీలించి, భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరగా దర్శనం అయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.