VIDEO: 'సీఎం రేవంత్ రెడ్డికి ఇంగితజ్ఞానం లేదు'
MHBD: సీఎం రేవంత్ రెడ్డికి ఇంగితజ్ఞానం లేదని MLC తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అన్నారు. మానుకోట పట్టణంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. KCR, హరీష్ రావులను జైల్లో వేయాలనే ఆత్రం తప్ప.. న్యాయపరమైన అవగాహన, ఆలోచన రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి లేదన్నారు. సీఎం ఆలోచనలో కుట్ర, విచారణలో లోపం ఉందని మండిపడ్డారు.