రైతులకు డ్రోన్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ప్రకాశం: తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా మార్కాపురం కందుల నారాయణరెడ్డి గ్రామంలోని రైతులకు వ్యవసాయ డ్రోన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సాంకేతికతను సద్వినియోగం చేసుకుని రైతులు తమ శ్రమను తగ్గించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.