డిఫెన్సివ్ డ్రైవింగ్‌తోనే ప్రమాదాలకు చెక్: ఎస్సై
SRPT: రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం 'అరైవ్-అలైవ్'లో భాగంగా నూతనకల్ మండల కేంద్రంలో ఆదివారం వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై నాగరాజు మాట్లాడుతూ.. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.