'విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లొద్దు'

'విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లొద్దు'

W.G: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీపీడీసీఎల్ నూజివీడు ఈఈ ఏ. సత్యనారాయణ కోరారు. తడి చేతులతో విద్యుత్ స్విచ్‌లను తాకవద్దని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లవద్దని సూచించారు. వర్షపు నీరు నిలిచి ఉన్న ప్రదేశాలు, రోడ్లపై ఉన్న విద్యుత్ లైన్ల దగ్గరకు వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు. విద్యుత్ సమస్యలు ఉంటే 1912కు కాల్ చేయాలన్నారు.