మురికి కాలువలో పడి వ్యక్తి మృతి

మురికి కాలువలో పడి వ్యక్తి మృతి

E.G: మురికి కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నిడదవోలు పట్టణంలో చోటుచేసుకుంది. శాంతినగర్‌కు చెందిన షేక్ షాకీర్(35) అనే వ్యక్తి గురువారం మురికికాలువలో పడి మృతి చెందగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జగన్మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.