VIDEO: తుది దశకు కానాజిగూడ కల్వర్టు నిర్మాణం..!

మేడ్చల్: కానాజిగూడ కల్వర్టు నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మంగళవారం పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.2.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని త్వరలోనే ప్రజల కోసం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వెంకటాపురం డివిజన్‌లో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా, స్థానిక ప్రజల సమస్యలు సైతం అడిగి తెలుసుకున్నారు.