చేబ్రోలులో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్

GNTR: చేబ్రోలులో మంగళవారం పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మురుగు కాలువల్లోని సిల్ట్‌ను తొలగించి, కాలువలను శుభ్రం చేశారు. రోడ్డుకిరువైపులా ఉన్న చెత్తాచెదారాలను, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి కారసాల శ్రీనివాసరావు పర్యవేక్షించారు. మురుగు కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హచ్చరించారు.