ప్రజల ఇంటికే సీఎం రిలీఫ్ చెక్కులు

ప్రజల ఇంటికే సీఎం రిలీఫ్ చెక్కులు

అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలో లబ్ధిదారుల ఇంటికే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అందజేశారు. సింగన రుక్మిణమ్మకు ₹1,40,000, గడ్డం చలపతికి ₹25,166 సహాయం అందజేశారు. "ప్రజల ప్రతి సమస్యకు వెంటనే స్పందింస్తూ.. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటుంది" అని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.