'గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను పునఃపరిశీలించాం'
ADB: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను రాజ్యాంగ నిబంధనలు, రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం, జనాభా ప్రాతిపదిక, బీసీ డిక్లరేషన్ కమిషన్ నివేదికలను పరిగణలోకి తీసుకొని పునఃపరిశీలించినట్టు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో వారి జనాభాకన్నా తక్కువగా రిజర్వేషన్లు ఉండకూడదన్నారు. అదే సమయంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదన్నారు.