VIDEO: వాహనదారులకు ఆహ్లాదాన్ని ఇస్తున్న పచ్చదనం

JGL: రహదారి వెంట ఉన్న చెట్లు వాహనదారులకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. రాయికల్ మండలం మైతాపూర్-పైడిమడుగు ప్రధాన రహదారి వెంట ఉన్న చెట్లు కళకళలాడుతున్నాయి. హరితహారంలో పెట్టిన చెట్లు ఏపుగా పెరిగి రహదారి నిండుగా స్వాగత తోరణంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ రహదారిలో వెళ్లే వాహనదారులు, యువతీ యువకులకు పచ్చదనం ఆకట్టుకోవడంతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు.