అదుపు తప్పితే అంతే సంగతులు!
ASF: రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని సింగరేణి కాలనీలో రోడ్డుపై ఏర్పడిన గుంతతో కార్మికులు, కార్మికేతరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి రామాలయం వీధిలోని కాల్వర్టు కుంగిపోయింది. రోడ్డు కుంగిపోయి ప్రమాదకరంగా మారిందని సింగరేణి అధికారులు స్పందించి కాల్వర్టుకు మరమ్మత్తులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.