పొక్సో కేసులో యువకుడికి శిక్ష

VZM: 2022లో గుర్ల PSలో నమోదైన పొక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. తన బిడ్డ కనిపించడం లేదని ఓ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బాలిక ఆచూకీ కనుగొన్నామని, పెనుబర్తికి చెందిన గుడిశ సూర్యనారాయణ అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసినట్లు గుర్తించామన్నారు.