ఉచిత పోటీ పరీక్షల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
SRPT: జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఐదు నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈనెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనీ అన్నారు. ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష ద్వారా 100 మందిని ఎంపిక చేసి, ఉచిత భోజన, వసతితో శిక్షణ ఇస్తారని వెల్లడించారు.