దీక్షా దివాస్ విజయవంతం చేయాలి:మాజీ ఎంపీ
MHBD: నేడ నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ వేడుకలు జరుగుతాయని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు తప్పక హాజరు కావాలని ఆమె కోరారు.