వేగంగా పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

వేగంగా పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

HNK: మొంథా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు నష్టపోయిన కాలనీల సర్వే వివరాల నమోదు ప్రక్రియ ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే వివరాలను సోమవారం నాటికి ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో RDO రాథోడ్ రమేష్ పాల్గొన్నారు.