నేడు మండల సర్వసభ్య సమావేశం
SKLM: టెక్కలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరగనున్నట్లు ఎంపీడీఓ ఎం.రేణుక శుక్రవారం తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఎంపీపీ ఆట్ల సరోజినమ్మ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి వివిధ శాఖల అధికారులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు హాజరుకావాలని ఆమె కోరారు. సమావేశంలో ప్రభుత్వ శాఖల వారీగా సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.