పేకాట స్థావరాలపై దాడులు

పేకాట స్థావరాలపై దాడులు

KNR:పేకాట స్థావరంపై మెరుపు దాడి చేసి బుధవారం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు. చిన్నకోమటిపల్లి శివారులో కొంతమంది రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేసి వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.18,300 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.