హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోలిపర్తి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం హనుమాన్ జయంతోత్సవం పురస్కరించుకొని బుధవారం హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలాదారులు ప్రత్యేక హోమం నిర్వహించారు. మధ్యాహ్నం హనుమాన్ పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. రేపు హనుమాన్ జయంతోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు.