కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీలు చేస్తాడా..?
విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదాడు. విశాఖ వేదికగా రేపు జరిగే మ్యాచ్‌లోనూ అతడు శతకం సాధిస్తే హ్యాట్రిక్ నమోదు చేస్తాడు. గతంలో కోహ్లీ 11 సార్లు ఇలా వరుసగా రెండు సెంచరీలు చేయగా, అందులో కేవలం ఒక్కసారి మాత్రమే హ్యాట్రిక్ నమోదు చేశాడు.