మంత్రి లోకేష్‌పై పేర్నినాని ఆగ్రహం
AP: మంత్రి లోకేష్‌పై మాజీమంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆవేదన పట్టించుకోలేదని విమర్శించారు. 'రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బాగోలేదని రోజూ SMలో వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ, ఏనాడూ మంత్రి లోకేష్ స్పందించలేదు. దేశాలు దాటి క్రికెట్ మ్యాచ్‌లు చూడటంపైన ఆయనకున్న శ్రద్ధ పిల్లలకు మంచి భోజనం పెట్టడం పైన లేదు' అని మండిపడ్డారు.