VIDEO: రోడ్డు ప్రమాదం.. 10 మందికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. 10 మందికి గాయాలు

VZM: విజయనగరం నుంచి గజపతినగరం వెళ్తున్న టాటా మ్యాజిక్, పార్వతీపురం నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై గొట్లాం సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్సుల్లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.