యూరియాను మాత్రమే పంటలకు వినియోగించాలి: కలెక్టర్

యూరియాను మాత్రమే పంటలకు వినియోగించాలి: కలెక్టర్

విజయనగరం: వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు సూచించిన మేరకు యూరియాను మాత్రమే పంటలకు వినియోగించాలని, అధికంగా వాడితే అనర్థం అని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జిల్లాలో ఉన్న యూరియా లభ్యత, పంపిణీపై కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.