విద్యతోనే గౌరవం: డా. శ్రీధర్

SKLM: గార మండలం వమ్మర విల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్‌ను జన సేన నాయకులు, ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డా. దానేటి శ్రీధర్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే గౌరవం, విలువ పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు ఉన్నత విద్య సాధించి సమాజంలో మంచి స్థానం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ఉన్నారు.