ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

KDP : తొండూరు మండలం బూచుపల్లి, బోడివారిపల్లిలో ఆదివారం ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా డాక్టర్లు మీనాక్షి, ఉదయ్ కుమార్, సంజీవ్ కరణ్ ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు బాల పుల్లయ్య, రమణ, రాహుల్, పాల్గొన్నారు.