మార్చి 16 నుండి పదవతరగతి పరీక్షలు

మార్చి 16 నుండి పదవతరగతి పరీక్షలు

VZM: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యంనాయుడు మంగళవారం తెలిపారు. పరీక్షలకు సంబంధించి హాల్ టిక్కెట్లు మార్చి మొదటి వారంలో www.bse.ap.gov.inలో పొందుపరుస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, హాల్ టిక్కెట్లను మన మిత్ర యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.