నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీతో చర్చలు

కామారెడ్డి: జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్‌ని ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎంపీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.