అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి స్వల్ప గాయాలు
MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున మేడారం వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలెట్ రాజు, ఈఎంటీ మహేష్ క్షత్రగాత్రులను ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.