VIDEO: హైవేపై ఆశా కార్యకర్తల ఆందోళన
MBNR: ఆశా కార్యకర్తలు తమ పెండింగ్ వేతనాలను విడుదల చేయాలంటూ సోమవారం జడ్చర్ల పట్టణంలో హైవేపై ఆందోళన చేశారు. రహదారిపై భారీగా జనం బైఠాయించడంతో భారీ ట్రాఫిక్ నిలిచింది. ఈ క్రమంలో ఒక కార్యకర్త స్పృహ తప్పి పడడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే సీఐ నాగార్జున గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.