గడివేముల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

గడివేముల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ బుధవారం గడివేముల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, లాకప్ గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం జనరల్ డైరీ, డ్యూటీ రోస్టర్, ఎఫ్ఐఆర్ ఇండెక్స్, పెండింగ్ కేసుల రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో ఉన్న వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలు, వాటి స్థితిగతులపై ఎస్పీ ఆరా తీశారు.