VIDEO: నర్సంపేట వరమ్మ తోట దారిలో దుర్వాసన బెడద
WGL: నర్సంపేట పట్టణంలో వరమ్మ తోట వెళ్లే రహదారిపై మురుగు నీటి దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత సైడ్ కాలువలు లేకపోవడంతో తాత్కాలిక కాలువలు, పగిలిన పైపుల వల్ల మురుగు రోడ్డుపైకి చేరుతోంది. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.