'ది ఫ్యామిలీ మ్యాన్'.. లక్ష్యమదే: మనోజ్
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్-3 ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈనెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మనోజ్ బాజ్‌పాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రేక్షకుడు తనను తాను తెరపై చూసుకున్నట్టే ఉండాలన్న లక్ష్యంతోనే శ్రీకాంత్ పాత్ర రూపొందించినట్లు తెలిపాడు.