మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు: సీపీ
PDPL: ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పోలీస్ శాఖ ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు, కంటి వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా వివరించారు. జైపూర్ మండలంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలనిన సూచించారు.