వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దని పేర్కొంది. ఈ కాలుష్యానికి రైతులను నిందించడం సరికాదని తెలిపింది. పర్యావరణాన్ని రక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది. కొంతమందిని జైలుకు పంపటం ద్వారా మిగిలిన రైతులకు గట్టి సందేశం ఇచ్చినట్లు అవుతుందని చెప్పింది.