ముదిగొండ నూతన ఎస్సైగా కృష్ణ ప్రసాద్

KMM: ముదిగొండ మండల పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా కృష్ణ ప్రసాద్ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సీఐ మురళిని కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ప్రసాద్‌కు పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.