VIDEO: జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏపీ నైపుణ్య శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ హాజరయ్యారు. ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళాలను ఏర్పాటు చేస్తోందని, యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.