నర్మల-సిద్దిపేట రహదారి మూసివేత

SRCL: గంభీరావుపేట మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు నర్మల ఎగువ మానేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆయ ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తుంది. సోమవారం నర్మల గ్రామం నుంచి సిద్దిపేట వెళ్లే రహదారిని పోలీస్ అధికారులు మూసేశారు. అత్యవసరమైతే మల్లారెడ్డిపేట గ్రామం నుంచి గోపాల్ పల్లి మీదుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.