భార్యతో గొడవ.. టవర్ ఎక్కిన భర్త
కోనసీమ: ఆలమూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ టర్నింగ్ వద్ద చీదల రామారావు అనే వ్యక్తి ఆదివారం భార్యతో గొడవపడి సమీపంలోని హైపవర్ కరెంట్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎస్సై నరేశ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రామారావును సురక్షితంగా కిందికి దింపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.